![]() |
![]() |

అదితి భావరాజు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో పాటలు పడింది. ప్లే బ్యాక్ సింగర్ గా మంచి పేరు తెచ్చుకుంది. ఐతే అఖండ మూవీలో "జై బాలయ్య" సాంగ్ తో ఆమె పేరు టాప్ లోకి చేరిపోయింది. అలాగే తమిళ్ మూవీ 'ఎనిమి'లో "టంటం" సాంగ్ కూడా అదితి పాడింది. అది కూడా సూపర్ డూపర్ హిట్టయింది. ఐతే తానెవరో ఆడియన్స్ కి నిరూపించుకోవడం కోసం అదితి తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 లో పార్టిసిపేట్ చేసింది. ఐతే ఆమె ఎలిమినేట్ అయ్యింది. ఇక తరవాత ఆమెకు మంచి ఆఫర్స్ కూడా వచ్చాయి.
ఐతే రీసెంట్ గా ఒక షోలో ఆమె తన మనసులోని కొన్ని మాటల్ని చెప్పారు. "నీ దగ్గర వరకు వచ్చి ట్రాక్ పాడాక మిస్సైన సాంగ్ ఏమిటి..అయ్యో ఈ సాంగ్ ఎందుకు మిస్సయ్యిందా అని రిగ్రెట్ ఐన సాంగ్ ఏమిటి ..? అని అడిగిన ప్రశ్నకు ఆమె "పాట అంటే ఆ ట్యూన్ పాడలేదు దానికి వేరే వెర్షన్ పాడాను. గుంటూరు కారంలో మూవీలో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ కి నేను రామ్ మిరియాల పాడాం. కానీ ఆ సాంగ్ వర్కౌట్ కాలేదు లాస్ట్ లో. షూటింగ్ వరకు వెళ్ళింది కానీ అక్కడితోనే ఆగిపోయింది." అంటూ కొంచెం ఫీలయ్యింది. అలాగే తెలుగు ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీస్ లో నవీన్ పోలిశెట్టి మీద బిగ్ క్రష్ ఉందని.. కుదిరితే లాంగ్ డ్రైవ్ కూడా వెళ్లాలనుంది అని చెప్పింది అదితి.
![]() |
![]() |